Employees Health Scheme అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం. నగదు రహితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కొరకు ప్రస్తుతం కొనసాగుతున్న APIMA Rule 1972 ననుసరించి మెడికల్ రీయింబర్స్ మెంట్ సిస్టమ్ స్థానంలో ఈ Employees Health Scheme ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం ను ప్రవేశపెట్టడం జరిగింది.

E.H.S యొక్క FINANCIAL COVERAGE:
ఎ) ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి ఆధారిత కుటుంబ సభ్యులు ఇది వరకు ఏ విధంగానైతే APIMA Rules, 1972ను అనుసరించి ప్రతి ఏపిసోడ్ అనారోగ్యంనకు పొందుచుట రూ. 2 లక్షలకు అర్హులు. రూ. 2 లక్షల పైబడినప్పటికీ నగదురహిత వైద్యం కొనసాగును. ఏ నెట్వర్క్ ఆస్పత్రి వైద్యం నిరాకరించుటకు లేదు. బి) రూ. 2 లక్షల పైబడిన ప్యాకేజీ రేట్ గల వైద్యంనకు యూనిట్ రూ. 2 లక్షలు ఉండదు. సి.ఇ.వో., ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ రూ. 2 లక్షల పైబడినవాటికి సంబంధించిన బిల్లులను టెక్నికల్ కమిటీ ఆమోదానంతరం మంజూరు చేస్తారు.
Employees Health Scheme HOSPITALS:
ఎ) AHCT నిబంధనలు పాటించు విధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల జాబితాను WWW.ehf.gov.inలో ఉంచుతారు. బి) Empanelled ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడిన లేదా misuse చేసినా ఆస్పత్రిని బ్లాక్ లిస్టులో ఉంచుతూ మొత్తం సొమ్మును తిరిగి రాబట్టి క్రిమినల్ చర్యలు చేపట్టబడును. సి) ఎవరైనా లబ్దిదారులు అవకతవకలకు పాల్పడినా లేదా దుర్వినియోగం చేసినా A.P. C.S. (CCA) Rules, 1991 ప్రకారం చర్యలు తీసుకోబడును.
FINANCING for Employees Health Scheme:
పథకం యొక్క ఆర్థిక సర్దుబాటులు:
పథకం అమలు: పథకం అమలు మొత్తం 60% ప్రభుత్వం భరిస్తుండగా 40% ఉద్యోగ, పెన్షనర్ల contribution గా ఉంటుంది.
E H S Hospital Payments:
ఎ) చెల్లింపులు ఆమోదించిన ప్యాకేజీ రేటు ప్రకారం జరుగును. బి) ఆస్పత్రిలో చేరిన రోజు నుండి డిస్చార్టీ అయిన 10 రోజుల వరకు అందించిన దానికి ఒక ప్యాకేజీగా భావిస్తారు. బి) ప్యాకేజీలో investigations, medicines, implants, consumables, diet, post-operations / post-treatment complications and follow up care arising from the therapeutic intervention.
E.H.S Slabs and Premium Rates(నెలవారి కంట్రిబ్యూషన్):
Slab Pay – Grades – Amount
Slab A – I toIV – Rs. 90
Slab B – V to XVII – Rs. 90
Slab C – XVIII to XXXII – Rs. 120
Slab-A and Slab-B వారికి semi-private వార్డులకు అర్పులు, Slab-Cవారు private వార్డులకు అర్హులు. సర్వీసు, పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్లకు సర్వీసు నుండి రిటైర్ అయినప్పుడు గల వేతన గ్రేడ్ననుసరించి ఉండును.
ఒక వేళ భార్య, భర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనర్లు అయిననూ ఎవరో ఒకరి కంట్రిబ్యూషన్ మాత్రమే సరిపోతుంది. ఇట్టి సందర్భాలలో అభ్యర్థి తన స్పౌస్ ప్రభుత్వ ఉద్యోగి లేదా సర్వీసు పెన్షనర్ అని ఎంప్లాయి కోడ్/ పెన్షనర్ కోడ్ తో సహా ధృవీకరించాలి.