మనం ప్రతీ సంవత్సరం జనవరి ౩వ తేదీన ,జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం(National woman teachers day) జరుగుతుంది.
తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే జయంతి
జనవరి 03 – జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం:

సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే జయంతి నేడు. ఈమె జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపబడుతుంది. ఈమె గొప్ప సంఘసంస్కర్త హరిజన విద్యకు కృషి చేసిన జ్యోతిరావు పూలే యొక్క సతిమణి. భర్తనే ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి కృషి చేశారు.పూనాలో తన భర్త స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించడంలో ఈమె కృషి ఎంతో గొప్పది.
తన జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పా టు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
ఈమె కృషి కేవలం స్త్రీ విద్యకే పరిమితంకాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు సేవ చేసిన గొప్ప మహిళ.భయంకరమైన ప్లేగు వ్యాధి తో బాధపడుతున్న వారికి సేవ చేస్తూనే మరణించింది.
సావిత్రిబాయి పూలే జీవితం సమాజసేవలో ప్రతీ ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే ఆదర్శం.